Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం

హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ను ప్రాసిక్యూషన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ నేడో, రేపో ఛార్జిషీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో అర్వింద్ కుమార్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర అనుమతించడం గమనార్హం.

ఫార్ములా ఈ-కార్ రేస్ ను 2023లో హైదరాబాద్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకుగాను విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్దంగా నిధులు చెల్లించిన కారణంగా రూ. 54.88 కోట్ల నష్టం జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం విదితమే. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించడంవల్లే ఆ నిధులను విదేశీ సంస్థకు చెల్లించినట్లు అప్పట్లో మున్సిపల్ శాఖకు స్పెషల్ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహించిన అర్వింద్ కుమార్ సర్కారుకు లిఖితపూర్వక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇదే అంశాన్ని ఆయన ఏసీబీ విచారణలోనూ అంగీకరించారు. కాగా ఈ కేసులో కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ గతంలోనే అనుమతించడం గమనార్హం.

Popular Articles