ఆసిఫాబాద్: మావోయిస్ట్ పార్టీకి చెందిన 16 మంది నక్సలైట్లను తెలంగాణా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలం పెదదోబలోని ఓ గుడిసెలో నక్సల్స్ ఆశ్రయం తీసుకుని ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు కూంబింగ్ నిర్వహించడం ద్వారా వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
పోలీసులకు చిక్కిన నక్సల్స్ ఛత్తీస్ గఢ్ కు చెందినవారుగా గుర్తించారని కూడా సమాచారం. అరెస్టయిన మావోయిస్టుల నుంచి ఒక ఏకే-47, రెండు ఇన్సాస్ ఆయుధాలను స్వాధీనం చేసుకుని, మావోయిస్టులను హైదరాబాద్ కు తరలించినట్లు తెలిసింది.

