మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు జగదీష్ రెడ్డిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జగదీష్ రెడ్డిని ‘లిల్లీపుట్’ లీడర్ గా అభివర్ణించారు. అతని వల్లే నల్లగొండ జిల్లాలో పార్టీ నాశనమైందన్నారు. జగదీష్ రెడ్డి పేరును కవిత నేరుగా ప్రస్తావించకుండా పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ అన్నదమ్ములు స్పందించలేదన్నారు. దీని వెనుక పెద్ద నాయకుడి హస్తముందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. తన వద్ద కొందరు మనుషులను ఏర్పాటు సమాాచారం సేకరిస్తున్నట్లు వారు భావిస్తున్నారని, కానీ అక్కడేం జరుగుతోందో తనకు కూడా సమాచారం ఉందన్నారు. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని కవిత పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఆదివారం కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు.


