Top 5 This Week

Related Posts

షటిల్ కోర్టులో గుండెపోటు, ఖమ్మం జిల్లా యువకుడి మృతి

షటిల్ కోర్టులో ఆడుతూనే గుండెపోటుకు గురై 25 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నాగోల్ స్టేడియంలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు రాకేష్(25) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే నాగోల్ షటిల్ కోర్టులో షటిల్ ఆడుతూనే రాకేష్ ఉన్నట్టుండి కుప్పకూలాడు. దీంతో సహచరులు అతన్ని కాపాడేందుకు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా, రాకేష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

షటిల్ ఆడుతూ రాకేష్ కుప్పకూలుతున్న, పడిపోయిన దృశ్యాలు

Popular Articles