కర్రెగుట్టలపై భద్రతా బలగాలు బావుటాను ఎగురవేశాయి. బాంబులు అమర్చామని, ఇటువైపు ఎవరూ రావద్దని మావోయిస్టులు బాహాటపు ప్రకటన చేసిన నేపథ్యంలో తెలంగాణా-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలను లక్ష్యంగా చేసుకుని పోలీస్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘ఆపరేషన్ కర్రెగుట్ట’ ప్రక్రియలో భాగంగా భద్రతా బలగాలు ఇక్కడి అడవుల్లో పట్టు సాధించాయి. ఈమేరకు కర్రెగుట్టపై ఛత్తీస్ గఢ్ కు చెందిన భద్రతా బలగాలు జాతీయ పతాకాన్ని ఎగురవేశాయి.

ఇదే దశలో కర్రెగుట్టలపై CRPF బేస్ క్యాంప్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాలకు అందుబాటులో ఉండే విధంగా ఈ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు ఇప్పటికే భారీ సొరంగాలను గుర్తించిన సంగతి తెలిసిందే. గడచిన తొమ్మిది రోజులుగా జరుగుతున్న ‘ఆపరేషన్ కర్రెగుట్ట’ ప్రక్రియలో ముగ్గురు మహిళా నక్సలైట్లు ఎన్కౌంటర్ లో మరణించగా, 150కి పైగా మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. కర్రెగుట్టలపై పోలీసులు జాతీయ పతాకాన్ని ఎగురవేసిన వీడియోను దిగువన చూడవచ్చు.


