Top 5 This Week

Related Posts

‘భక్తుల బాధ్యత నాదే’

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తూ, కరోనా మహమ్మారితో ఎన్ని కష్టాలు వచ్చినా సంకోచించకుండా భక్తులు ఉత్సవాలను వైభవంగా నిర్వహించారని, అందుకు తనకు సంతోషంగా ఉందని చెప్పారు. భక్తులు సంతోషంగా ఉండే విధంగా చూసుకొనే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.

ఎంత పెద్ద ఆపద వచ్చినా తాను భక్తుల వెంటే ఉండి కాపాడుతానని భరోసా ఇచ్చారు. కరోనా మహమ్మారి ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టిందన్నారు. అంతేగాక ఈసారి వర్షాలతో రైతులు కాస్త ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భక్తులు తనను నమ్మి పూజలు చేశారని, వారిని కాపాడే బాధ్యత తనదేనని స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తూ చెప్పారు.

Popular Articles