Top 5 This Week

Related Posts

Breaking: కర్నాటక సీఎం రాజీనామా!

తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. సీఎంగా రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో యడియూరప్ప భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండేళ్లపాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపానని చెబుతూ, సీఎం పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

ఈ మధ్యాహ్నం గవర్నర్ ను కలుస్తానని చెప్పారు. గవర్నర్ ను కలిశాక, మధ్యాహ్నం తర్వాత సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేసే అవకాశాలున్నాయి. బీజేపీ కర్నాటక రాజకీయాల్లో తాజా పరిణామాలు సంచలనం కలిగిస్తుండగా, యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పిస్తారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Popular Articles