Top 5 This Week

Related Posts

బీజేపీ ఎంపీ బండి సంజయ్ మిస్సింగ్!

బీజేపీకి చెందిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ 24 గంటలుగా కనిపించడం లేదు. తన భద్రత కోసం కేటాయించిన సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి, వారిని వదిలేసి ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోవడం కలకలానికి కారణమైంది. కరీంనగర్ నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంజయ్ బుధవారం సాయంత్రం ఐదు గంటల నుంచి కనిపించకుండా పోవడం గమనార్హం. తనను అనుసరిస్తున్న భద్రతా సిబ్బంది కళ్లుగప్పి సంజయ్ అదృశ్యం కావడం రాజకీయంగా సంచలనం కలిగిస్తోంది.

సంజయ్ కనిపించకుండా పోయిన ఘటనపై అటు బీజేపీ శ్రేణులు, ఇటు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆందోళన చెందుతున్నారు. తన ఎన్నికల ప్రచారంలో రాళ్లదాడి జరిగిందని సంజయ్ ఆరోపించగా, అటువంటిదేమీ లేదని నగర పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలోనే సంజయ్ అదృశ్యం కావడం గమనార్హం.

Popular Articles