Top 5 This Week

Related Posts

నక్సల్స్ దుశ్చర్య: ఫారెస్ట్ రేంజర్ కిడ్నాప్, హత్య

ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు నక్సల్స్ అటవీ శాఖకు చెందిన ఓ అధికారిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది.

ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం కొండోర్జీ భైరమ్ గఢ్ అటవీ రేంజ్ ప్రాంతానికి ఫారెస్ట్ రేంజర్ రాత్రమ్ పటేల్ అటవీ శాఖ సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు వెళ్లగా నక్సల్స్ కిడ్నాప్ చేశారు. అనంతరం ఆయనను పదునైన ఆయుధంతో చంపేసి డెడ్ బాడీని రోడ్డుమార్గంలో విసిరేశారు.

నక్సల్స్ చేతిలో హత్యకు గురైనా ఫారెస్ట్ రేంజర్ ఇంద్రావతి టైగర్ రిజర్వులోని భైరమ్ గఢ్ ఎన్ క్లోజర్ లో విధులు నిర్వహిస్తున్నారు. జంగ్లా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తుండగా, ఉదంతాన్ని బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ ధృవీకరించారు.

Popular Articles