Top 5 This Week

Related Posts

సున్నం రాజయ్య మృతిపై ఎంపీ ‘నామా’ దిగ్భ్రాంతి

కరోనా మహమ్మారి పొట్టనబెట్టుకున్న భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి పట్ల ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు, లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మంచి ప్రజా నాయకున్ని కోల్పోయిందన్నారు.

భద్రాచలం ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు, సీపీఎం రాష్ట్ర కార్య వర్గ సభ్యునిగా సున్నం రాజయ్య ప్రజలకు చేసిన సేవలు అజరామరమని గుర్తు చేశారు. మొదటి నుండి మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులు కోసం రాజయ్య ఎంతో సేవ చేశారని ఈ సందర్భంగా కొనియాడారు.

తన జీవితాంతం ప్రజలకోసం పని చేసిన సున్నం రాజయ్య మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు నామా నాగేశ్వరరావు తన సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Popular Articles