ఖమ్మం: జిల్లాలో, ఖమ్మం నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమీక్షించారు. ఖమ్మం నగరంలో చేపట్టిన పనులను షెడ్యూల్ ప్రకారం నాణ్యతతో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో పురోగతిలో గల పలు అభివృద్ధి పనులపై మంత్రి తుమ్మల సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి శుక్రవారం సమీక్షించారు.

ఖమ్మం ఖిల్లా రోప్ వే, సింథటిక్ ట్రాక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, శిల్పారామం, క్రికెట్ స్టేడియం, యంగ్ ఇండియా సమీకృత గురుకుల నిర్మాణం, వైద్య కళాశాల, కేబుల్ బ్రిడ్జి, మున్నేరు రిటైనింగ్ వాల్, సమీకృత మార్కెట్, మంచుకొండ ఎత్తిపోతల పథకం, హరిత హోటల్, టిటిడి స్కూల్, స్వామి నారాయణ గురుకుల స్కూల్, సీతారామ ఎత్తిపోతల పథకం, వెలుగు మట్ల అర్బన్ పార్క్ పనులపై మంత్రి సమీక్షించి పలు సూచనలు చేశారు.

