హైదరాబాద్: తెలంగాణాలో ఓ న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ మహానగరంలోని మాసాబ్ ట్యంక్ ఏరియాలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
న్యాయవాది ఖాజా మొహినుద్దీన్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి కారులో బయలుదేరేందుకు సిద్ధపడుతుండగా, వెనుక నుంచి మరో కారుతో వేగంగా వచ్చిన దుండగులు అతన్ని ఢీకొట్టారు. కారుతో ఢీకొట్టిన కారణంగా తీవ్ర గాయాలపాలైన మొహినుద్దీన్ ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే మొహినుద్దీన్ ప్రాణాలు కోల్పోయారు. దుండగులు న్యాయవాది మొహినుద్దీన్ ను కారుతో ఢీకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

