Top 5 This Week

Related Posts

అమెరికాలో రోడ్డు ప్రమాదం: ఖమ్మం యువతి దుర్మరణం

ఖమ్మం: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖమ్మం యువతి దుర్మరణం చెందారు. ఖమ్మం నగర శివార్లలో గల పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సింహాద్రినగర్‌కు చెందిన దారం సుప్రజ (31) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో మృతి చెందారు.

సుప్రజ అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తూ అక్కడే నివసిస్తున్నారు. గత రాత్రి రెస్టారెంట్ మూసివేసి స్నేహితురాలితో కలిసి కారులో ఇంటికి వెళ్తుండగా, వారు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. దీంతో సుప్రజ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆమెతో గత స్నేహితురాలు తీవ్రంగా గాయపడ్డారు.

సుప్రజకు భర్త, కుమారుడు ఉన్నారు. సుప్రజ అకస్మిక మృతితో సింహాద్రినగర్‌లోని ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల్లో తీవ్ర విషాదం అలుముకుంది. సుప్రజ కుటుంబం సొంత గ్రామం మహబూబాబాద్ జిల్లా మరిపెడ కాగా, కొన్నేళ్ల క్రితం ఖమ్మం నగర శివార్లలోని ఏదులాపురం మున్సిపాలిటీలో గల సింహాద్రి నగర్ కు వచ్చి స్థిరపడ్డారు.

Popular Articles