Top 5 This Week

Related Posts

‘జూబ్లీహిల్స్’లో చూసుకుందాం!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణా కమ్మ సంఘాల సమాఖ్య అల్టిమేటమ్ జారీ చేసింది. తమ సామాజికవర్గాన్ని అనుచిత వ్యాఖ్యలతో తూలనాడినట్లు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వెల్లడించిన అంశంపై స్పష్టత ఇవ్వాలని సమాఖ్య కేటీఆర్ ను డిమాండ్ చేసింది. సీఎం రమేష్ ఇటీవల బహిర్గతం చేసిన వ్యాఖ్యలను అన్నారా? లేదా? అనే అంశంపై కేటీఆర్ స్పందించకుంటే అనుచిత పదాలు ఆయన నోటినుంచి వెలువడినట్లుగానే తాము నమ్మాల్సి ఉంటుందన్నారు. కేటీఆర్ స్పందించకుంటే వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కమ్మోళ్లం ఏం చేయాలో అది చేస్తామని హెచ్చరించారు. ఈమేరకు తెలంగాణా కమ్మ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బొడ్డు రవిశంకర్ రావు, వెంగళరావు నగర్ అధ్యక్షుడు ఉన్నం సుబ్బారావు, ఉప్పలపాటి రాణి తదితర కమ్మ నేతలు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియాతో మాట్లాడారు.

Popular Articles