ఎమ్మెల్సీ శింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి జరిగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆగ్రహంతో జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఉప్పల్ మేడిపల్లిలో గల ఆఫీసులోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఎమ్మెల్సీ కవిత బీసీ ఉద్యమాన్ని తప్పుపడుతూ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో తీన్మార్ మల్లన్న అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు రక్షణగా ఉన్నటువంటి గన్ మెన్ ఐదు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




