Top 5 This Week

Related Posts

చీరల వ్యాపారం ముసుగులో ఉగ్రవాదం!

ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం గల ఇద్దరు సోదరులను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. సిద్ధికీ, మహ్మద్ ఆలీ అనే ఇద్దరు సోదరులను అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఐబీ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. కోయంబత్తూరులో 1995లో జరిగిన పేలుళ్ల కేసులో వీరిద్దరు నిందితులుగా ఉన్నారు. దివంగత బీజేపీ అగ్రనేత ఎల్ కే అడ్వానీ రథయాత్ర సందర్బంగానూ వీరిద్దరు కుట్ర చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అయితే గడచిన 30 సంవత్సరాలుగా రాయచోటిలో మారుపేర్లతో సిద్ధిఖీ, మహ్మద్ ఆలీలు సంచరిస్తున్నట్లు ఐబీ అధికారులు గుర్తించారు. పైకి చీరల వ్యాపారం నిర్వహిస్తూ లోలోన ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం నెరపుతున్నట్లు గుర్తించారు. వీరిద్దరినీ పట్టుకోవడానికి చెన్నయ్ కి చెందిన ఐబీ అధికారులు కూడా మారువేషాల్లో రాయచోటిలో తిరగడం విశేషం. వీరి నివాసాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పుస్తకాలు,ఇతరత్రా సామాగ్రిని ఐబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Popular Articles