Top 5 This Week

Related Posts

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా

తెలంగాణాలో అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా వైరస్ సోకింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ కు, అతని భార్యకు, కుమారుడికి, పనిమనిషికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మేడ్చల్ డిప్యూటీ డీఎంహెచ్ వో ప్రకటించారు.

టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, గణేష్ గుప్తాలు ఇప్పటికే కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా హోం మంత్రి మహమూద్ ఆలీ కూడా కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు.

Popular Articles