Top 5 This Week

Related Posts

మరో భారీ ఎన్కౌంటర్: 20 మంది మావోల మృతి

ఛత్తీస్ గఢ్ అడవులు మళ్లీ నెత్తురోడాయి. నక్సలైట్లకు, పోలీసులకు మధ్య శనివారం ఉదయం నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 20 మందికిపైగా మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. సుక్మా జిల్లా గోగుండ కొండపై ఇరువర్గాల మధ్య ఇంకా భీకరపోరు జరుగుతోంది. ఇదే ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడినట్లు సమాచారం.

గోగుండ కొండ గుట్టల్లోని అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన పరిణామాల్లో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. DRG, CRPF విభాాగాలకు చెందిన భద్రతా బలగాలు నక్సలైట్ల గాలింపు చర్యల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Popular Articles