Top 5 This Week

Related Posts

ఖమ్మం కలెక్టర్ కు సీఎస్ ప్రశంస

ఖమ్మం: ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ను తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రశంసించారు. రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో చిక్కుకున్నవారిని రాత్రింబవళ్లు శ్రమించి, అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సురక్షితంగా రక్షించడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేకంగా అభినందించారు. అత్యవసర, ఆందోళనకర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ చూపిన చొరవ, నాయకత్వం అందరికీ ఆదర్శమని సీఎస్ ప్రశంసించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ను ఆయా విధంగా ప్రశంసించారు. తాగునీటి సరఫరా, పీఎంశ్రీ పాఠశాలలు, సమగ్ర శిక్షా అభియాన్ నిధుల వినియోగం, ఇందిరమ్మ ఇళ్లు, వీబీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించి జిల్లాల కలెక్టర్లకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

తన ‘ఎక్స్’ ఖాతాలో ఖమ్మం కలెక్టర్ ను ప్రశంసిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం చేసిన పోస్ట్

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర సీఎస్ కు వివరిస్తూ ఖమ్మం–దేవరపల్లి జాతీయ రహదారి భూసేకరణకు సంబంధించి 98 శాతం అవార్డులు జారీ చేసినట్లు తెలిపారు. మిగిలిన రూ.3 కోట్ల విలువైన అవార్డులకు సంబంధించి టోకెన్లు జనరేట్ అయ్యాయని, చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ పి. శ్రీజ, డిఆర్డీవో కె. శ్రీరామ్, డిపిఓ వినోద్ కుమార్, ఆర్ అండ్ బి ఎస్ఇ యుగంధర్ రావు, మిషన్ భగీరథ ఇఇ వాణిశ్రీ, జిల్లాలోని మునిసిపాలిటీ ల కమిషనర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Popular Articles