Top 5 This Week

Related Posts

దోరెపల్లి శ్వేత సన్నిహితుడు సాయినాథ్ ‘వసూళ్ల’ ఇష్యూలో కీలక పరిణామం

ఖమ్మం: బీఆర్ఎస్ పార్టీకి చెందిన తాజా మాజీ కార్పొరేటర్ దోరెపల్లి శ్వేత ముఖ్య అనుచురుడు, సన్నిహితునిగా ప్రాచుర్యం పొందిన దేవశెట్టి సాయిపై వచ్చిన ఛీటింగ్ ఆరోపణల అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయినాథ్ తమకు వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధి చేకూరుస్తానని డబ్బు తీసుకున్నట్లు పలువురు బాధితులు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ను నిన్న ఆశ్రయించారు. ఈమేరకు బాధితులు ఖమ్మం టూటౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు కూడా చేశారు.

తమకు వచ్చిన ఫిర్యాదుపై అటు బాధితులుగా పేర్కొన్నవారిని, ఇటు ఆరోపణలు ఎదుర్కున్న సాయినాథ్ ను ఖమ్మం టూటౌన్ సీఐ జి. రామక్రిష్ణ స్టేషన్ కు పిలిపించి పూర్వాపరాలపై ఆదివారం విచారించారు. ఈ నేపథ్యంలోనే తాజా మాజీ కార్పొరేటర్ దోరెపల్లి శ్వేత సాయినాథ్ వసూళ్ల వ్యవహారాలపై కీలక ప్రకటనను విడుదల చేశారు.

అయితే ఈ అంశంలో మొత్తం పరిణామాలు కీలక మలుపు తీసుకోవడం విశేషం. సాయినాథ్ తమ వద్ద తీసుకున్న డబ్బు మొత్తాలను ఆదివారం తిరిగి తమకు చెల్లించినట్లు ఖమ్మం నగరంలోని రమణగుట్టకు చెందిన ఎనిమిది మంది బాధితులు ఖమ్మం టూటౌన్ సీఐ జి. రామక్రిష్ణకు లేఖ ఇచ్చారు. సాయినాథ్ తమకు డబ్బు చెల్లించాడని, చేసిన ఫిర్యాదును తాము వాపస్ తీసుకుంటున్నామని, ఇందుకు అంగీకరించాలని సీఐని కోరుతూ ఎనిమిది మంది బాధితులు ఈమేరకు లిఖతపూర్వకంగా అభ్యర్థించారు.

ఇదిలా ఉండగా తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తులకు ఇవ్వాల్సిన డబ్బును తిరిగి చెల్లించినట్లు దేవశెట్టి సాయినాథ్ ‘సమీక్ష’ న్యూస్ కు ఫోన్ ద్వారా చెప్పారు. ఈమేరకు ఫిర్యాదుదారులు ఖమ్మం టూటౌన్ సీఐకి ఇచ్చిన లేఖను సాయినాథ్ వాట్సాప్ ద్వారా పంపించారు. ఆయా లేఖను ఎగువన చూడవచ్చు.

Popular Articles