Top 5 This Week

Related Posts

ప్యారడైజ్ సినిమాలో ‘కేసీఆర్’ పాత్రపై కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్: ‘ప్యారడైజ్’ సినిమాలో కేసీఆర్ పాత్రగా బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన ‘శంకరన్న’ పాత్రపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

‘అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేతపై పోరాటం. సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి’ అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు. కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శికి ప్రత్యేక అభినందనలు ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా!!’’ You know who that is..’ అని కేటీఆర్ తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా ట్వీట్ చేశారు.

నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తీసిన ‘ది ప్యారడైజ్’ సినిమాను కేటీఆర్ గత రాత్రి తిలకించారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలతో కలిసి కేటీఆర్ ‘ప్యారడైజ్’ సినిమాను చూశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ 35ఎంఎం థియేటర్ లో కేటీఆర్ తోపాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆయా నాయకులు చిత్రాన్ని వీక్షించారు.

Popular Articles