Top 5 This Week

Related Posts

ఖమ్మంలో 11 మంది సీఐల బదిలీ

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 మంది సీఐలను బదిలీ చేస్తూ ప్రభుత్వం గత రాత్రి ఉత్తర్వు జారీ చేసింది. వీరిలో నలుగురు సీఐలకు పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఈమేరకు మల్టీ జోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం స్థానచలనానికి గురైన సీఐల వివరాలు ఇలా ఉన్నాయి.

  • జ్ఞానదృష్టి రామక్రిష్ణను ఖమ్మం సీఎస్బీ నుంచి ఖమ్మం టూ టౌన్ సీఐగా బదిలీ చేశారు.
  • బొమ్మెర బాలక్రిష్ణను ఖమ్మం టౌ టౌన్ నుంచి బదిలీ చేస్తూ ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.
  • మహ్మద్ సాదిక్ పాషాను మెయిన్ ఇంటెలిజెన్స్ నుంచి ఖమ్మం వన్ టౌన్ సీఐగా బదిలీ చేశారు.
  • తాటిపాముల కరుణాకర్ ను ఖమ్మం వన్ టౌన్ నుంచి ఖమ్మం వేకెన్సీ రిజర్వులో ఉంచి, రఘునాథపాలెం స్టేషన్ కు అటాచ్ చేశారు.
  • మహ్మద్ ఉస్మాన్ షరీఫ్ ను ఖమ్మం వీఆర్ నుంచి మహిళా పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.
  • నల్లమోతు చిట్టిబాబును మహిళా పోలీస్ స్టేషన్ నుంచి ఖమ్మం త్రీ టౌన్ కు బదిలీ చేవారు.
  • జిల్లెలమూడి మోహన్ బాబును ఖమ్మం త్రీ టౌన్ నుంచి ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.
  • మేడిపల్లి నాగరాజును భద్రాచలం టౌన్ నుంచి ఖానాపురం హవేలీకి బదిలీ చేశారు.
  • రడం భానుప్రకాష్ ను ఖానాపురం హవేలీ నుంచి ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
  • కాగితోజు శివప్రసాద్ ను సీటీసీ నుంచి ఖమ్మం ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేశారు.
  • బెల్లం సత్యనారాయణను ఖమ్మం ట్రాఫిక్ నుంచి బదిలీ చేస్తూ ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

Popular Articles