Top 5 This Week

Related Posts

పోలీసు ఉద్యోగాలకు రాత పరీక్ష తేదీలు ఇవే..!

హైదరాబాద్: తెలంగాణాలో పోలీసు ఉద్యోగాల రాత పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఎస్ఐ అభ్యర్థులకు నవంబర్ 29వ తేదీన, కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 20వ తేదీన రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మెన్ వీవీ శ్రీనివాసరావు ప్రకటించారు. పోలీసు ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,77,064 మంది దరఖాస్తు చేసుకోగా, ఇందులో ఎస్ఐ పోస్టులకు 1,60,756 మంది, కానిస్టేబుల్ పోస్టులకు 3,89,356 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ముఖ్యాంశాలు:

  • ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష నవంబర్ 29న నిర్వహించే అవకాశం.
  • పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష డిసెంబర్ 20న నిర్వహించే అవకాశం.
  • ఎస్ఐ పరీక్ష ఉదయం పూట తెలంగాణలోని పూర్వపు 10 జిల్లా కేంద్రాల్లో నిర్వహణ.
  • కానిస్టేబుల్ పరీక్ష 15 నుంచి 18 కేంద్రాల్లో నిర్వహించే అవకాశం.
  • గత జూలై 29న నాలుగు విభాగాల్లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ.
  • పోలీస్ శాఖలో 5 వేల పోస్టులు.. వీటిలో 200 ఎస్ఐ స్థాయి, 4,800 కానిస్టేబుల్ స్థాయి పోస్టులు.
  • స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 1,424 పోస్టులు.
  • ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్‌లో 790 పోస్టులు.
  • జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్‌లో 223 పోస్టులు.
  • మొత్తం 7,437 పోస్టులకు నోటిఫికేషన్లు.
  • వయోపరిమితిలో సడలింపుతో దాదాపు 1.13 లక్షల మంది అభ్యర్థులకు ప్రయోజనం.
  • ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ.
  • మొత్తం 5,77,064 దరఖాస్తులు.
  • 4,29,000 మంది అభ్యర్థులు దరఖాస్తు.
  • ఒక్కో అభ్యర్థి సగటున 1.34 దరఖాస్తులు చేసినట్లు వెల్లడి.
  • ఒక్క పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసిన వారు 68.45 శాతం.
  • రెండు పోస్టులకు దరఖాస్తు చేసిన వారు 28.88 శాతం.
  • ఒక్కటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసిన 1,35,359 మందికి ఫీజు రాయితీ.
  • మొత్తం దరఖాస్తుల్లో మహిళలు 25.33 శాతం.
  • పురుషుల దరఖాస్తులు 74.66 శాతం.
  • తొలిసారిగా పోలీస్ నియామక ప్రక్రియలో ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్.
  • 97.4 శాతం మంది అభ్యర్థులు ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ పూర్తి.
  • మిగిలిన 2.6 శాతం మంది సెప్టెంబర్ 30లోగా ఆథెంటికేషన్ పూర్తి చేసుకోవాలి.
  • SI/సమాన స్థాయి పోస్టులకు 1,60,756 దరఖాస్తులు.
  • PC/సమాన స్థాయి పోస్టులకు 3,89,356 దరఖాస్తులు.
  • ASI FPB పోస్టులకు 11,992 దరఖాస్తులు.
  • PC డ్రైవర్ పోస్టులకు 12,495 దరఖాస్తులు.
  • PC మెకానిక్ పోస్టులకు 2,465 దరఖాస్తులు.
  • పరీక్ష మాధ్యమంగా 56.84 శాతం మంది తెలుగు ఎంపిక.
  • 43.02 శాతం మంది ఇంగ్లీష్ ఎంపిక.
  • 0.12 శాతం మంది ఉర్దూ మాధ్యమం ఎంపిక.
  • దరఖాస్తుల సంఖ్యలో డీ-డూప్లికేషన్, వాలిడేషన్ తదితర ప్రక్రియల కారణంగా స్వల్ప మార్పులు ఉండొచ్చని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడి.

Popular Articles