Top 5 This Week

Related Posts

అన్నది నా తల్లిని, నీతల్లిని కాదు..: హరీష్ రావుపై స్పీకర్ ఆగ్రహం

హైదరాబాద్: బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుపై తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహించారు. మంగళవారం అసెంబ్లీలో తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ, మహిళా ఎమ్మెల్యేలకు నిన్న అవమానం జరిగిందని, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మిల విషయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, ఇది కౌరవ సభ అంటూ హరీష్ రావు మాట్లాడుతుండగా, స్పీకర్ ప్రసాద్ కుమార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావును ఉద్ధేశించి స్పీకర్ ఏమన్నారంటే..

‘హరీష్ రావు గారూ..! మహిళా శాసనసభ్యులంటే సభకు గౌరవం.. అధ్యక్షునిగా నాకూ గౌరవం ఉంది. వినండి.. మీరు చెప్తే నేను వింటలేనా? మీకెందుకంత ఆవేశం..? నాకుండాలి అవేశం.. మీగ్గాదు.. నీ తల్లిని అన్లేదు.. అన్నది నా తల్లిని.. నా తల్లిని అన్నడు. నాకుండాలి ఆవేశం. నీకెట్లుంటది ఆవేశం..? ఎట్లా ఉంటది నీకు ఆవేశం.? వినూ.. నా మాటను. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు అన్నా.. శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు అన్నా.. శ్రీమతి కోవా లక్ష్మిగారు అన్నా.. అత్యంత గౌరవం మాకు. నాకు గల ఎనిమిది మంది అక్కాచెల్లెళ్లలో వాళ్లు కూడా నా అక్కా చెల్లెళ్లు.. వారి మీది ఇట్ల జరిగిందని తెలిశాక ఇమ్మిడియేట్ గా ఎంక్వయిరీకి పంపించా.. రిపోర్ట్ ఇస్తరు.. ఇయ్యంగనే చర్యలు తీసుకుంటం తప్పకుండా. కానీ నా సంగతేది చెప్పు హరీష్ రావు గారూ..? నా సంగతి చెప్పు నువ్వు.. నా సంగతి చెప్పు. మీ తల్లిని అన్లేదు.. నా తల్లిని అన్నరు.. నా సంగతి జెప్పు.. నా సంగతి జెప్పు..’ అని స్పీకర్ ఆగ్రహించారు.

Popular Articles