ములుగు: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కను ఆమె జన్మదినం సందర్భంగా కమ్మ సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సూరపనేని నాగేశ్వర్ రావు గురువారం ములుగులో కలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మంత్రి సీతక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

ఆదివాసీ ఆడబిడ్డ, మంత్రి సీతక్క మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా పాటుపడుతున్న సీతక్క కృషికి వనదేవతలైన మేడారం సమ్మక్క-సారలమ్మలు మరింత శక్తిని ప్రసాదించాలని ఆయన కోరారు. ప్రజాసేవలో పరితపిస్తూ నిరాడంబరంగా జీవిస్తున్న సీతక్కకు నాగేశ్వర్ రావు ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సీతక్క నాయకత్వంలో ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత పాటుపడతామని నాగేశ్వర్ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

