మేడారం: వనదేవతల సన్నిధి మేడారం మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. ఈమేరకు మేడారం పూజారుల సంఘం మినీ జాతర తేదీలను ఖరారు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మేడారం మినీ జాతర జరుగుతుందని తెలిపింది. నాలుగు రోజులపాటు శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా జరుగుతుందని పేర్కొంది. ఇవీ మేడారం మినీ జాతర వివరాలు:
- ఫిబ్రవరి 17వ తేదీ: సారలమ్మ గద్దెపైకి రాక
- ఫిబ్రవరి 18వ తేదీ: సమ్మక్క గద్దెపైకి రాక
- ఫిబ్రవరి 19వ తేదీ: భక్తులు మొక్కులు సమర్పించడం
- ఫిబ్రవరి 20వ తేదీ: సమ్మక్క-సారలమ్మ దేవతలు తిరిగి వనప్రవేశం

