ఖమ్మం: ఈనెల 30వ తేదీన ఖమ్మం జిల్లాలో జరగాల్సిన సీఎం సభ రద్దయింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాధపురంలో మంగళవారం ‘రైతు ఆశీర్వాద సభ’ నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇదే వేదికపై ఖరీఫ్ సీజన్ రైతు భరోసా నిధులను విడుదల చేయాలని కూడా నిర్ణయించారు.
అయితే భారీ వర్షాల కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కావలసిన ఈ సభను రద్దు చేశారు. ఇదే దశలో రైతు భరోసా నిధులను యధావిధిగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో మంగళవారం నిర్వహించే కార్యక్రమంలో రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. రేపు సాయంత్రం 4.00 గంటలకు జరిగే శిల్పకళా వేదికగా జరిగే సభలో సీఎం రైతు భరోసా నిధులను విడుదల చేస్తారని అధికార వర్గాలు చెప్పాయి.

