Top 5 This Week

Related Posts

లాయర్ హత్యకు రూ. 25.00 లక్షల సుపారీ

హైదరాబాద్: ఈనెల 23వ తేదీన దారుణ హత్యకు గురైన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ (63) హత్య కేసులో సంచలన అంశాలు వెలుగు చూశాయి. లాయర్ మొయినుద్దీన్ ను హతమార్చేందుకు రూ. 25.00 లక్షల సుపారీ ఇచ్చినట్లు పోలీసులు తమ దర్యాప్తులో కనుగొన్నారు. ఈమేరకు న్యాయవాది మొయినుద్దీన్ హత్య కేసులో ప్రధాన నిందితులుగా గుర్తించిన మహబూబ్ ఆలంఖాన్ ను, అతని కుమారుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ హత్యోదంతంలో మరో ముగ్గురు వ్యక్తులు కూడా నిందితులుగా ఉన్నట్లు చెప్పారు.

వక్ఫ్ బోర్డు ప్యానెల్ లాయర్ గా పని చేస్తున్న మొయినుద్దీన్ ను చంపేందుకు నిందితులు గడచిన రెండేళ్లలో పదిసార్లు విఫలయత్నం చేసినట్లు కూడా పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. రెడ్ హిల్స్ శాంతినగర్ ప్రాంతంలో నివసించే మొయినుద్దీన్ హైకోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వక్ఫ్ స్థలాల అంశంలో ఓ ప్రముఖ విద్యా సంస్థపై ఆయన లీగల్ గా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత 23వ తేదీన ఈతకు వెళ్లేంుదకు ఇంటి నుంచి బయటకు వచ్చి తన కారులో బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా, మరో కారుతో నిందితులు అతన్ని ఢీకొట్టి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

Popular Articles