Top 5 This Week

Related Posts

కారు కొనాలనుకుంటున్నారా..? అయితే ఓసారి ఇది చదవండి!

ఆర్థికంగా వెసులుబాటు ఉన్నా, కొత్త కార్లు కొనాలని ఉత్సాహపడేవాళ్లు కొన్నాళ్లు వేచి చూడటం మంచిది. ఆర్థిక మాంద్యం పరిస్థితులు చుట్టుముడుతున్నాయి. తప్పని సరైతే తప్ప కార్ల జోలికి వెళ్లకపోవడం మంచిది.

  • కార్ల ఇంధనం ధరలు 15-20 శాతం పెరిగి అవకాశం ఉంది. డీజిల్ పై లీటర్ కు రూ.100 నష్టం వస్తోందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంటే వడ్డింపులు దశల వారిగా ఉంటాయని తెలుస్తూనే ఉంది. ఇటీవల పెరిగిన ఇంధన ధరలు ఇదే అంశాన్ని చెప్పకనే చెబుతున్నాయి కూడా.
  • కార్ల తయారీలో వాడే స్టీల్, ప్లాస్టిక్ సామాగ్రి, రబ్బర్ టయర్ల ధరలు 20 – 30 శాతం పెరగొచ్చు. పెట్రోలియం ఉత్తత్తుల నుంచి టయర్లు, ప్లాస్టిక్ విడిభాగాలు తయారవుతాయి. క్రూడాయిల్ ధరలు బ్యారెల్ 100 డాలర్ల ను దాటిన పరిస్థితుల్లో వాటి ధరలుపెరగటం తథ్యం. పెయింట్ల ధరలు కూడా పెరుగుతాయి.
  • పెరిగిన కార్ల ధరలు, ఇంధన ధరల వల్ల దూర ప్రయాణాలు చేయడం భారం అవుతుంది. బస్సులు, రైళ్లలో ప్రయాణం చేయడం ఉత్తమం.
  • రోడ్ల నిర్మాణంలో వాడే తారు కూడా పెట్రోలియం రిఫైనరీల ఉప ఉత్పాదనే.. దాని ధర కూడా పెరుగుతుంది. బొగ్గు రవాణా వ్యయం పెరగటం వల్ల సిమెంటు ధరలు పెరుగుతాయి. ఒక రకంగా రవాణా వ్యయాలన్నీ పెరుగుతాయి.
  • విద్యుత్తు ఉత్పాదన వ్యయం కూడా పెరగటం వల్ల యూనిట్ తయారీ ఖర్చు పెరుగుతుంది. ఎప్పుడో ఒకసారి ఛార్జీలు పెంచక తప్పదు.
  • సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలి.
  • ఎల్ నినో ప్రభావం వల్ల రుతుపవనాలు మందగిస్తే వ్యవసాయ సంక్షోభం తలెత్తుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోతాయి. బియ్యం, గోధుమలు, నూనెలు, కూరగాయలు మొత్తం పిరమవుతాయి. మీ ఆదాయం, జీతం ఖర్చులకు సరిపోతాయి.
  • పిల్లల చదువులు, ఆరోగ్యరక్షణ కూడా భారమవుతుంది.
  • అందువల్ల మరోసారి చెప్పేదేమిటంటే.. తప్పనిసరైతే తప్ప కార్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది.

Popular Articles