హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. బదిలీకి గురైనవారిలో డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, సవ్యసాచి ఘోష్, సందీప్ కుమార్ సుల్తానియా, డి. దివ్య, ఆర్వీ కర్ణన్, జి. శిరీష, టి. వినయ్ క్రిష్ణారెడ్డి, పి. కాత్యాయనీదేవి, మయాంక్ మిట్టల్, యు. రఘురామ్ శర్మలు ఉన్నారు.
ఇదే దశలో జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు జీహెచ్ఎంసీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ లను కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వు విడుదల చేసింది. జీహెచ్ఎంసీ కార్పొరేషన్ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్ ను, సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్‌గా శ్రీజనను, మల్కాజిగిరి కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డిని నియమించించింది. సింగరేణి సిఎండీగా జ్యోతి బుద్ద ప్రకాష్‌ను నియమించింది.
అదేవిధంగా జలమండలి పరిధి విస్తరించి ముగ్గురు నాన్ కేడర్ అధికారులను ఈడీలుగా నియమించారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా ఉన్న పంకజకు జలమండలి మల్కాజిగిరి ఈడీగా పోస్టింగ్ ఇచ్చారు. సామ్రాట్ అశోక్ కు జలమండలి హైదరాబాద్ ఈడీగా, సంతోష్ ను జలమండలి సైబరాబాద్ ఈడీగా, ప్రస్తుతం జలమండలి ఈడీ పని చేస్తున్న మయాంక్ మిట్టల్ కు జాయింట్ ఎండీ గా పోస్టింగులు ఇచ్చారు.
ఆయా ఐఏఎస్ ఆఫీసర్లను, నాన్ కేడర్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు విడుదల చేసిన ఉత్తర్వు ప్రతులను దిగువన గల పీడీఎఫ్ ఫైల్స్ లో చూడవచ్చు.

