కొత్తగూడెం: రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కొత్తగూడెం నగరంలో కదం తొక్కాయి. బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఎంపీ వద్దిరాజు నాయకత్వంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఈ చర్యను వ్యతిరేకిస్తూ నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ వద్దిరాజు వెంట మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ, తదితర నాయకులు, కార్యకర్తలు గులాబీ, నల్ల కండువాలు ధరించి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పాల్పడుతోందని ఆరోపిస్తూ నినదించారు.

