హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది సబ్ డివిజనల్ పోలీసు అధికారుల (డీఎస్పీ/ఏసీపీ)ను తెలంగాణా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈమేరకు డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వు జారీ చేశారు. బదిలీకి గురైన పోలీసు అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ గా పనిచేస్తున్న ఎల్. ఆదినారాయణను కొత్తగూడెం డీఎస్పీగా బదిలీ చేస్తూ, ఇక్కడ పనిచేస్తున్న షేక్ అబ్దుల్ రహమాన్ ను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ సీటీసీ ఏసీపీగా పనిచేస్తున్న డీవీ ప్రదీప్ కుమార్ రెడ్డిని ఆదిభట్ల ఏసీపీగా, సీఐడీలో డీఎస్పీగా పనిచేస్తున్న ఎం. ఆదిమూర్తిని మియాపూర్ ట్రాఫిక్ ఏసీపీగా, మల్కాజిగిరి ఏసీపీ ఎస్. చక్రపాణిని జవహర్ నగర్ ఏసీపీగా, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీగా పనిచేస్తున్న బి. మోహన్ కుమార్ ను మేడిపల్లి ఏసీపీగా బదిలీ చేశారు.
అదేవిధంగా యాంటీ నార్కోటిక్ బ్యూరోలో డీఎస్పీగా పనిచేస్తున్న సీహెచ్. శ్రీధర్ ను మహంకాళి ఏసీపీగా, తెలంగాణా పోలీస్ అకాడమీలో డీఎస్పీగా ఉన్న ఎస్. సారంగపాణిని ఇల్లెందు డీఎస్పీగా బదిలీ చేస్తూ, ఇక్కడ పనిచేస్తున్న ఎన్. చంద్రభానును డీజీపీ ఆపీసులో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వులో ఆదేశించారు.

