Top 5 This Week

Related Posts

భారీ ఎన్కౌంటర్, పలువురు మావోయిస్ట్ కీలక నేతలు మృతి

ఛత్తీస్ గఢ్ లో గురువారం జరిగిన భారీ ఎన్కౌంటర్ లో పలువురు అగ్రనేతలు సహా 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. గరియాబంద్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర పోరు జరిగింది. ఇరువర్గాల కాల్పుల్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మోదెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ మరణించినట్లు తెలుస్తోంది. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండకు చెందిన మనోజ్ పై రూ. 2.00 కోట్ల రివార్డు ఉంది. అదేవిధంగా మృతి చెందిన పది మంది మావోల్లో ఒడిషా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్ అలియాస్ పాండు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో చనిపోయిన మొత్తం 10 మంది నక్సలైట్లలో మరికొందరు కీలక నేతలు కూడా ఉండి ఉంటారని ధ్రువపడని సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నాయని, కాల్పులు ముగిసన తర్వాత మృతులు ఎవరనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Popular Articles