- వివాహేతర సంబంధంతో భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నిన భార్య లవర్..
- హత్య చేయించేందుకు రూ. 20 లక్షల సుపారీ, అడ్వాన్స్ గా రూ. 5 లక్షలు చెల్లింపు..
- ఐదుగురు గురు నిందితుల సుపారీ గ్యాంగ్ అరెస్ట్..
- ఆయుధాలు, రూ. 90 వేల నగదు, ఐదు సెల్ ఫోన్లు, కారు స్వాధీనం..
ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలీ సీఐ భానుప్రకాష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ముదిగొండ మండలం సువర్ణపురం గ్రామానికి చెందిన తోట ధర్మ అనే వ్యక్తి భార్యతో అదే గ్రామానికి చెందిన కొండూరి రామంజనేయులు @రాము అనే వ్యక్తికి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భర్త ధర్మకు ఈ అక్రమ సంబంధం విషయం తెలిసి భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.

ఎలాగైనా ప్రియురాలి భర్త అడ్డు తొలగించి అక్రమ సంబంధం కొనసాగించాలని హత్యకు ప్రణాళిక రచించిన కొండూరి రామంజనేయులు ముందుగా ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం గ్రామానికి చెందిన దంతాల వెంకట నారాయణ @ రాము అనే వ్యక్తికి ధర్మనుహత్య చేయాలనే విషయాన్ని వివరించాడు. దాంతో వెంకట్ తన స్నేహితుడైన రౌడీ షీటర్ పగాడాల విజయ్ కుమార్ @చంటి’ని A1 నిందుతుడు కు పరిచయం చేశాడు.
హత్య కు 20 లక్షల రూపాయలు సుపారీ గా ఒప్పుకున్నారు. అడ్వాన్స్ గా 5 లక్షలు తీసుకొన్నారు.
పధకం ప్రకారం గత నెల 12 న (మార్చి 12) శశి డాబా దంసాలపురం వద్ద తోట దర్మ ను కిడ్నాప్ చేసిన నిందుతులు పలు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రాముకు వీడియో కాల్ ద్వారా ధర్మను చూపించి నిర్ధారించుకున్నారు. హత్య చేస్తామని మరికొంత డబ్బు చెల్లించాలని రామును నిందితులు అడిగారు. కాల్ కట్ చేసిన రాము పలుమార్లు కాల్ చేసిన స్పందించలేదు. దీంతో విసుగు చెందిన నిందితులు బంధించిన ధర్మను బెదిరించి ఫోన్ పే ద్వారా లక్ష యాబై వేల రూపాయల నగదు, బంగారు గొలుసు తీసుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయారు.

బాధితుడు ధర్మ తనకు ప్రాణహాని వుందని ఈనెల 11న ఇచ్చిన ఫిర్యాదుతొ కేసు నమోదు చేసి టౌన్ ఏసీపీ రమణమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపారు ఖానాపురం హవేలీ పోలీసులు. ఆదివారం నగరంలోని చెరుకూరి మామిడి తోటలో సుపారీ గ్యాంగ్ సమావేశం అయినట్లు అందిన విశ్వసనీయ సమాచారంతొ నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఇన్స్‌పెక్టర్ తెలిపారు. నిందితుల నుండి, రెండు కత్తులు, ఎయిర్ గన్, రూ. 90 వేల నగదు, సెల్ ఫోన్లు, TS 04 EH 5679 అనే నెంబరు గల కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అరెస్టయిన నిందితులు వీళ్లే:
A1 – Konduri Ramanjaneyulu @Ramu 34yrs, Owner cum Proclain operator R/o Suvarnapuram village of Mudigonda Mandal
A2 – Danthala Venkata Narayana @ Venkat, 31yrs, Car driver R/o Barugudem village of Khammam Rural Mandal
A3 – Pagadala Vijay Kumar @ Chanti, 30yrs, Motor cycle mechanic R/o Road No.6 Agraharam New Colony Khammam
A4 – Vemula Krishna, 2lyıs, Motor cycle mechanic R/o Road No.19 Agraharam Colony Khammam
A5 – Burri Vijay 23yrs, Decoration work R/o Brundavan Colony Puvvada Ajay Nagar Colony Khammam

