Top 5 This Week

Related Posts

HCUలో పోలీసు బలగాలు: ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో పోలీసు బలగాల మోహరింపుపై తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. HCUలో పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నామని, సంరక్షణకు తగిన చర్యలు చేపట్టాలంటూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బీజే రావుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొద్దిసేపటి క్రితం ఓ లేఖ రాశారు.

కంచె గచ్చిబౌలి సమస్యపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సబ్ కమిటీ సమావేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ప్రొఫెసర్ సౌమ్య దేచమ్మ CC, ప్రొఫెసర్ శ్రీపర్ణ దాస్, ప్రొఫెసర్ భంగ్య భూక్య, పౌర సంఘాల ప్రతినిధులు విస్సా కిరణ్‌కుమార్, NAPM, V.సంధ్య, WTJAC – K.సజయ, WTJAC, ఇమ్రాన్ సిద్ధిఖీ, CWS-ఇండియా తదితరులు పాల్గొని యూనివర్సిటీలో మోహరించిన పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలని మంత్రుల బృందానికి వినతిపత్రం సమర్పించారు. ఈ విజ్ఞప్తిపై మంత్రుల సబ్ కమిటీ సానుకూలంగా స్పందించింది. సబ్ కమిటీ ఛైర్మెన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అధ్యాపకులు, రిజిస్టార్ గతంలో చేసిన విజ్ఞప్తిని క్రోడీకరిస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు లేఖ రాశారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Popular Articles