Top 5 This Week

Related Posts

ఏమిటా హత్య? సీఎం రేవంత్ ఆరా

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గత రాత్రి జరిగిన హత్యోదంతంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. కాళేశ్వరం మేడిగడ్డ కుంగుబాటుపై కేసు దాఖలు చేసిన రాజలింగమూర్తి అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు గత రాత్రి కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ హత్యోదంతానికి దారి తీసిన పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ నిఘా వర్గాల నుంచి ఆయన గురువారం సమాచారాన్ని కోరారు.

రాజలింగ మూర్తి

హత్యకు గురైన రాజలింగమూర్తి స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ సరళ భర్త. గతంలో భూతగాదాలతో హత్యాయత్నం జరిగినప్పటికీ తప్పించుకుని వచ్చారని రాజలింగమూర్తి భార్య, కౌన్సిలర్ సరళ చెబుతున్నారు. హత్య వెనుక గల కారకులను పట్టుకుని శిక్షించడం ద్వారా తనకు న్యాయం చేయాలని ఆమె రోదిస్తూ అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజలింగమూర్తి హత్యోదంతంపై సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరా తీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Popular Articles