ఛత్తీస్ ఘడ్ అడవుల్లో నక్సలైట్లకు, పోలీసులకు మధ్య ఆదివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మరణించగా, నక్సల్స్ తో జరిగిన భీకర పోరులో ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు నక్సల్స్ గాయపడ్డారు. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అడవుల్లో చోటు చేసుకున్న ఈ సంఘటనలో “ఆపరేషన్” కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. కాగా ఎన్కౌంటర్ ఘటనను బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ ధ్రువీకరించారు.
Update:
కాగా తాజా సమాచారం ప్రకారం ఈ ఎన్కౌంటర్ లో మరణించిన నక్సల్స్ సంఖ్య 31కి చేరినట్లు తెలుస్తోంది. అధికారికంగా ధృవపడాల్సి ఉంది.

