Top 5 This Week

Related Posts

తెలంగాణాలో నక్సల్స్ దుశ్చర్య, ఇద్దరి హత్య

తెలంగాణాలో మావోయిస్టు పార్టీ నక్సలైట్లు గత రాత్రి ఇద్దరిని హత్య చేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగొలను కాలనీలో నక్సల్స్ ఈ చర్యకు పాల్పడ్డారు. పోలీస్ ఇన్పార్మర్ల నెపంతో పేరూరు పంచాయతీ కార్యదర్శి ఊకె రమేష్, అతని తమ్ముడు ఊకె అర్జున్ లను నక్సలైట్లు గొడ్డళ్లతో నరికి చంపారు.

కాగా తమ కదలికల గురించి పోలీసులకు సమాచారం అందిస్తుండడం వల్లే తాము వీరిద్దరినీ హతమార్చినట్లు మావోయిస్టు పార్టీ వాజేడు – వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో ఘటనా స్థలంలో ఓ లేఖను కూడా నక్సలైట్లు వదలివెళ్లారు. నక్సల్స్ చర్యతో ములుగు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.

Popular Articles