Top 5 This Week

Related Posts

వరంగల్ లో ముగ్గురి దారుణ హత్య

వరంగల్ మహానగరంలో బుధవారం తెల్లవారు జామున ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. వరంగల్ లోని ఎల్బీనగర్ లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులపై జరిగిన దాడిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. ఎల్బీనగర్ లో నివసించే చాంద్ పాషా కుటుంబంపై అతని తమ్ముడు షఫీ అకస్మాత్తుగా కత్తులతో దాడి చేశాడు.

ఈ ఘటనలో చాంద్ పాషాతోపాటు ఖలీల్, సమీరా అనే అతని కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడినవారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు దారి తీసిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Popular Articles