Top 5 This Week

Related Posts

‘సోదరా.., సమ్మక్క తల్లి ఆశీస్సులు తీసుకొస్తున్నా’

రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి లభించడంపై ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘సోదరా… వనదేవతల (మేడారం సమ్మక్క-సారలమ్మ) ఆశీస్సులతోపాటు అంబేడ్కర్ ప్రేరణను తీసుకువస్తున్నా, మీకు అభినందనలు… ఆల్ ది బెస్ట్’ అంటూ ట్విట్టర్ వేదికగా సీతక్క పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి లభించిన అనంతరం నిన్న ఆమె మేడారంలో మొక్కులు కూడా చెల్లించుకున్నారు.

ఇందులో భాగంగానే మంగళవారం భారీ కార్ల ర్యాలీలో రేవంత్ ను కలిసేందుకు సీతక్క హైదరాబాద్ కు వెళ్లారు. ములుగు సమీపంలోని గట్టమ్మ తల్లి దేవాలంలో పూజలు నిర్వహించిన అనంతరం సీతక్క కార్యకర్తల భారీ ర్యాలీతో జూబ్లీ హిల్స్ లోని రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సీతక్క నిర్వహించిన కార్ల ర్యాలీ సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. సీతక్క ర్యాలీ వీడియో ట్వీట్ ను దిగువన మీరూ చూడవచ్చు.

Popular Articles