Top 5 This Week

Related Posts

ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ విధ్వంసం, ఎన్కౌంటర్

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ నక్సలైట్లు విధ్వంసానికి పాల్పడ్డారు. మరోవైపు ఇదే రోజు జరిగిన ఇంకో ఎన్కౌంటర్ ఘటనలో నక్సలైట్ ఒకరు మరణించాడు. బీజాపూర్ జిల్లా నెమేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మింగాచెల్ వద్ద నిర్మిస్తున్న వాటర్ ఫిల్టర్ వద్ద నక్సలైట్లు విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఐదు ఎజాక్స్, పొక్లెయిన్ వాహనాలను తగులబెట్టారు.

అదేవిధంగా దంతెవాడ జిల్లా జంగంపాల్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన మరో ఎన్కౌంటర్ ఘటనలో నక్సలైట్ ఒకరు మరణించారు. ఘటనా స్థలం నుంచి తుపాకులను, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఫొటో: నక్సల్స్ తగులబెట్టిన వాహనాలు దహనమవుతున్న దృశ్యం

Popular Articles