Top 5 This Week

Related Posts

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం

ఆర్టీసీలో మహిళల, బాలికల ఉచిత ప్రయాణానికి పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తమ రాష్ట్రంలోని 1.31 కోట్ల మంది మహిళలకు, బాలికలకు ఆర్టీసలో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఇందుకు పంజాబ్ మంత్రివర్గం కూడా ఇప్పటికే ఆమోదం తెలిపింది. మహిళా సాధికారతకు ఇది బలమైన అడుగుగా తాను భావిస్తున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ ఈ సందర్భంగా చెప్పారు. ఇందుకు సంబంధించి కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని కూడా పంచుకున్నారు.

Popular Articles