Top 5 This Week

Related Posts

ఖమ్మం బార్ అధ్యక్షునిగా ‘మలీదు’

ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా మలీదు నాగేశ్వర్ రావు ఎన్నియ్యారు. హోరాహోరీగా బుధవారం జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి గొల్లపూడి రామారావుపై ఎనిమిది ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా కోన చంద్రశేఖర్ గుప్తా, స్పోర్ట్స్, కల్చరల్ సెక్రెటరీగా గరిక సంపత్ కుమార్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కిలారు బాబ్జీ ప్రకటించారు. కొత్త కార్యవర్గంలో విజయం సాధించినవారికి ప్రముఖ న్యాయవాదులు స్వామి రమేష్ కుమార్, కొల్లి సత్యనారాయణ, దండా సుధాకర్ తదితరులు అభినందనలు తెలిపారు.

ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కోన చంద్రశేఖర్ గుప్తా

Popular Articles