Top 5 This Week

Related Posts

‘జబర్దస్త్ కమెడియన్’పై మానుకోటలో కేసు నమోదు

జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్‌పై మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్, దాడి కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం గూడూరు మండలం భూపతిపేటలో తన సోదరి భర్తపై కెవ్వు కార్తీక్ స్నేహితులతో కలిసి దాడి చేశాడు. కార్తీక్ వెంట మరో ఐదుగురు వ్యక్తులు కూడా వచ్చి తనపై దాడి చేసినట్లు బాధితుడు రవి కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు.

తనను కిడ్నాప్ చేసి, సుమారు పదిహేను కిలోమీటర్ల వరకు కారులో తీసుకెళ్ళి కొట్టించాడని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి కెవ్వు కార్తీక్‌తో పాటు అతని తల్లిదండ్రులు, వెంట వచ్చిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేశ్ నాయక్ వివరించారు.

Popular Articles