Top 5 This Week

Related Posts

ఖమ్మం పర్యటనలో మంత్రులకు నిరసన సెగ

సోమవారం ఖమ్మం పర్యటనకు వచ్చిన పలువురు మంత్రులకు ఎల్ఆర్ఎస్ రూపంలో నిరసన సెగ తగిలింది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంత్రులు కేటీఆర్, మహమూద్ ఆలీ, ప్రశాంత్ రెడ్డిలు ఖమ్మం పర్యటనకు వచ్చారు. మంత్రి పువ్వాడ అజయ్ సహా మొత్తం నలుగురు మంత్రులు ఎన్నెస్పీ కెనాల్ పై నిర్మించిన ‘వాక్ వే’ను ప్రారంభించేందుకు వెడుతుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ‘నో ఎల్ఆర్ఎస్… నో టీఆర్ఎస్’ నినాదాలతో ప్లకార్డులు చేబూని మంత్రుల పర్యటనలో నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

Popular Articles