Top 5 This Week

Related Posts

పేదల ఇండ్లకు ఖమ్మం జిల్లాలో రూ. 300 కోట్ల దాత

ఖమ్మం: నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఖమ్మం జిల్లా నుంచి ఓ దాత భూరి మొత్తాన్ని వ్యయం చేసేందుకు ముందుకొచ్చారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ. 300 కోట్ల సొంత నిధులతో పేదలకు 5,000 ఇండ్లను నిర్మించేందుకు తాన్లా ఫౌండేషన్ తరపున దాసరి ఉదయ్ కుమార్ రెడ్డి ముందుకొచ్చినట్లు తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ప్రకటించారు. ఈమేరకు సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారంలో తాన్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని, లాబరేటరీలను మంత్రి సందర్శించారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే, తాన్లా ఫౌండేషన్ నల్ల ఉదయ్ కుమార్ రెడ్డి తన సొంత నిధులతో సుమారు 300 కోట్ల రూపాయల వ్యయంతో 5,000 ఇళ్లను నిర్మించి ఇస్తానని మాట ఇచ్చారని తెలిపారు. దీనికి సంబంధించి దసరా పండుగ సందర్భంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, ఆదినారాయణలతో సమన్వయం చేసుకుని అర్హులైన నిరుపేదలకు స్థలాలు కేటాయించే ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సత్తుపల్లి, అశ్వరావుపేట ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, జారే ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Popular Articles