హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది తహశీల్దార్లకు జిల్లా రెవెన్యూ అధికారులు (డీఆర్వో), స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు (ఎస్డీసీ)లుగా పోస్టింగులు ఇస్తూ తెలంగాణా ప్రభుత్వం బుధవారం ఉత్తర్వు జారీ చేసింది. పరిపాలనా సౌలభ్యంతో భాగంగా ఈ ఉత్తర్వు తక్షణమే అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ ఉత్తర్వును విడుదల చేశారు. తహశీల్దార్ల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.
నిర్మల్ లో గల ఎ. మోతారాంను మంచిర్యాల డీఆర్వోగా, పెద్దపల్లిలో గల బి. రాజేశ్వరిని పెద్దపల్లి డీఆర్వోగా, పెద్దపల్లిలో గల కేవై ప్రసాద్ ను జగిత్యాల డఆర్వోగా, వనపర్తిలో గల ఆర్. పాండును నాగర్ కర్నూల్ డీఆర్వోగా, ఖమ్మంలోని వి. రవికుమార్ ను ములుగు డీఆర్వోగా, మేడ్చల్-మల్కాజిగిరిలో గల జె. స్వామిని కరీంనగర్ డీఆర్వోగా, నాగర్ కర్నూల్ లో గల ఎ. పాండును కామారెడ్డి డీఆర్వోగా నియమించారు.
అదేవిధంగా సూర్యాపేటలో గల ఎం. సుదర్శన్ రెడ్డిని సిద్ధిపేటకు, ఖమ్మంలో గల ఎం. రమాదేవిని నల్లగొండ, పెద్దపల్లిలో గల జి. కుమారస్వామిని సిరిసిల్ల, కరీంనగర్ లో గల ఎన్. వెంకటరెడ్డిని ఇక్కడే భూసేకరణ విభాగాల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా పోస్టింగులు ఇచ్చారు. ఇక జనగామలో గల సీహెచ్. శ్రీకాంత్ ను మహబూబ్ నగర్ స్పెషల్ కలెక్టర్ పీఏగా నియమించారు. ఉత్తర్వు ప్రతిని దిగువన చూడవచ్చు.


