Top 5 This Week

Related Posts

కారులో రూ. 1.40 కోట్లు పట్టివేత

కారులో తరలిస్తున్న భారీ మొత్తపు నగదును కృష్ణా జిల్లా చిల్లకల్లు పోలీసులు పట్టుకున్నారు. ఆంధప్రదేశ్, తెలంగాణా సరిహద్దుల్లో వెలుగు చూసిన ఈ ఘటనలో మొత్తం రూ. 1.40 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఇద్దరు వ్యక్తులు కారులో ఈ భారీ మొత్తాన్ని రవాణా చేస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర నుంచి జగ్గయ్యపేట మండలం గౌరవరానికి చెందిన మిర్చి రైతులకు ఇచ్చేందుకు నగదును తీసుకువస్తున్నట్లు పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేనందున నగదును తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఐపీసీ 102 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిల్లకల్లు ఎస్ఐ వాసా వెంకటేశ్వరరావు చెప్పారు.

Popular Articles