Top 5 This Week

Related Posts

కోదండరాం ఎన్నికల ప్రచారం

టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం హన్మకొండలో గల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉదయమే కోదండరాం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం విశేషం. ఆర్ట్స్ కాలేజీ మైదానంలోకి వాకింగ్, జాగింగ్ కోసం వచ్చిన పట్టభద్రులను కోదండరాం కలిశారు.

తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి గల ఆవశ్యకతను వివరించారు. తనకు మద్ధతునివ్వాల్సిందిగా గ్రాడ్యుయేట్లను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే కోదండరాం ఏకంగా ప్రచారంలోకి దిగి, మిగతా పార్టీ అభ్యర్థులకన్నా ముందుండడం గమనార్హం.

Popular Articles