Top 5 This Week

Related Posts

ఛత్తీస్ గఢ్ లో కలకలం… తోటి జవాన్లపై కాల్పులు, ఒకరి మృతి

ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ సీఏఎఫ్ శిబిరంలో కొద్ది సేపటి క్రితం జరిగిన కాల్పుల ఘటన కలకలం కలిగించింది. దయాశంకర్ శుక్లా అనే జవాన్ తన సహచర జవాన్లపై కాల్పులు జరిపాడు. సంఘటనలో రవీరంజన్, మహ్మద్ షరీఫ్ గాయపడ్డారు. అయితే రవిరంజన్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అనంతరం కాల్పులకు తెగబడిన దయాశంకర్ తన సర్వీస్ రైఫిల్ తో కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇతని పరిస్థితి విషమంగా ఉందని, వివాదం నేపథ్యంలోనే తోటి జవాన్లపై దయాశంకర్ కాల్పులకు దిగాడని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వివరించారు.

Popular Articles